తాజ్‌మహల్‌పై కరోనా ప్రభావం.. సందర్శనను నిలిపివేసిన పర్యాటక శాఖ
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. క
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఇప్పిటికే కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సినిమా థియేటర్లు, జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోతాజ్ మహల్ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది.