Kamala Harris: కమలా హారీస్ ఇంటిముందు అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్

Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2021-03-18 10:09 GMT

కమల హర్రీస్:(ఫైల్ ఇమేజ్)

Kamala Harris: భారత సంతతికి చెందిన మహిళ ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి కారు నుంచి గన్, మందుగుండు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో కి చెందిన ఈ వ్యక్తిని 31 ఏళ్ళ పాల్ ముర్రేగా గుర్తించారు. అయితే తన కారును వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ కి కొన్ని మైళ్ళ దూరంలోని ఓ గ్యారేజీలో పార్క్ చేశానని ముర్రే చెప్పాడు. ఇతని కారులో పోలీసులు ఓ రైఫిల్, పలు లైవ్ తూటాలు, గన్ క్లిప్స్ ను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కమలా హారిస్ నివాసానికి సమీపంలో నిన్న మధ్యాహ్నం ముర్రెని సీక్రెట్ సర్వీసు అధికారులు అడ్డగించి ప్రశ్నించినపుడు తలాతోకాలేని సమాధానాలు చెప్పాడట. అయితే కమలా హారిస్, ఆమె భర్త డౌగ్ ఎమ్ హాఫ్ ఈ ఇంట్లిలో నివసించడం లేదు. వీరు వైట్ హౌస్ కి దగ్గరలోని బ్లేయిర్ హౌస్ లో ఉంటున్నారు.

కాగా ముర్రేపై ఇదివరకే కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.టెక్సాస్ నివాసి అయిన ఇతడు పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. టెక్సాస్ నుంచి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టును పురస్కరించుకుని ఇతడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ముఖ్యంగా ఆసియన్ అమెరికన్ ప్రముఖుల ఇళ్ళ వద్ద కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు. ఈ నెల 16 న అట్లాంటా లోని మూడు స్పా లలలో చొరబడిన యువకుడు 8 మందిపై కాల్పులు జరిపి వారిని పొట్టన బెట్టుకున్నాడు. 

Tags:    

Similar News