Supreme Court: సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Supreme Court: బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ లాయర్ వాదనలు
Supreme Court: సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Supreme Court: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా.. కోర్టు తీర్పును వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుధీర్ఘజైలు శిక్ష పడాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. మరోవైపు బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ చేసింది.