Supreme Court: పెగాసస్‌ పై నేటి నుంచి సుప్రీంకోర్టు విచారణ

* దర్యాప్తును కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు * పిటిషన్‌ను నేడు విచారణ చేయనున్న సుప్రీంకోర్టు

Update: 2021-08-05 03:13 GMT

సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో) 

Supreme Court: పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ స్పైవేర్ వ్యవహారంపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలను విచారించనుంది. చీఫ్ జస్టిస్ ఎన్‌.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం దీనిని చేపట్టనుంది. ఫోన్లపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎడిటర్స్ గిల్డ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరపనుంది..

పెగాసస్ వివాదంపై చర్చ జరపాలని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. చర్చ జరపాలని ప్రతిపక్షాలు జరిపేది లేదని ప్రభుత్వం ఈ వాదోపవాదాలు, నిరసనలు, వాగ్వాదాలతో పార్లమెంట్ స్తంభింస్తోంది. ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేస్తున్న పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. మరోవైపు పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది..

పెగాసస్ వివాదంలో మరిన్ని కొత్త విషయాలను ది వైర్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. మనదేశానికి చెందిన దాదాపు 300 మందిని లక్ష్యంగా ఎంచుకొని నిఘా పెట్టాల్సిన జాబితాలో వారి ఫోన్ నెంబర్లను చేర్చారని 17 మీడియా సంస్థలతో కూడిన గ్లోమల్ కన్సారియం పేర్కొంది. వీరిలో ప్రతి పక్షాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, హక్కుల సంఘాల నేతలు, జర్నలిస్టులు, లాయర్లు ఉన్నారంటూ ఓ జాబితాను ది వైర్ ఇప్పటికే ప్రచురించింది. అయితే రీసెంట్‌గా వెల్లడించిన వివరాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పని చేసిన ఇద్దరి ఫోన్లూ హ్యాకింగ్ జాబితాలో కనిపించాయని పేర్కొంది. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పాత ఫోన్ నెంబర్, మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నెంబర్ కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్టు తెలిపింది. దీంతో ఇవాళ పార్లమెంట్ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలి..

Tags:    

Similar News