Supreme Court: నీట్ పరీక్ష రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై... కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలన్న సుప్రీం
Supreme Court: నీట్ పరీక్ష రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
Supreme Court: నీట్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష రద్దు అంశంపై వివరణ ఇవ్వాలని... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి నోటీసులు జారీ చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. నీట్ రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీంకి మార్చాలని NTA పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. జులై 8న మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.