మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

Update: 2019-11-25 05:36 GMT
మహారాష్ట్ర

మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. లేఖలను సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు సమర్పించారు. బీజేపీ తరపున ముకుల్‌ రోహత్గీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తరపున కపిల్‌ సిబల్‌, సింఘ్వీ వాదనలు విన్పిస్తున్నారు. లేఖల ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంతీర్పుపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఏక్‌నాథ్ షిండే, అశోక్ చవాన్, జయంత్ పాటిల్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఢిల్లీలో ఉన్నారు.

Tags:    

Similar News