Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

*రూ.50 పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు *కోవిడ్‌తో మరణించినట్లు ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పరిహారం

Update: 2021-10-04 11:00 GMT

సుప్రీం కోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా) 

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు 50వేల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కోవిడ్‌తో మరణించినట్లు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పరిహారం అందించాల్సిందే అని పేర్కొంది. అలాగే, దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోపే బాధిత కుటుంబాలకు పరిహారం చేరాలని ఆదేశించింది.

మరోవైపు కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కీలక సూచనలు చేసిన సుప్రీం ధర్మాసనం డెత్ సర్టిఫికెట్ అప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం దగ్గరకు వెళ్లొచ్చని సూచించింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News