Viveka Murder Case: వివేకా హత్య కేసు జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించిన ధర్మాసనం

Update: 2023-03-20 13:30 GMT

Viveka Murder Case: సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను బాధ్యతల నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఆర్.షా ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని... ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది.

కేసును త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. మరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ నటరాజన్ సీబీఐ తరపున వాదనలు వినిపించారు. కేసు పురోగతిలో ఉందని... దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం కేసు పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

Tags:    

Similar News