Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్‌ 13 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Karnataka: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Update: 2024-03-22 06:31 GMT

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్‌ 13 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్‌ 13 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు 2023-24 విద్యాసంవత్సరంలో ఏప్రిల్‌ 12 వరకు చివరి పరీక్షలు జరగనున్నాయి.

ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయులు ఏప్రిల్‌ 18న జరిగే లోక్‌సభ ఎన్నికల శిక్షణ, ఇతర పనుల్లో పాల్గొనాలని పేర్కొంది. ఏప్రిల్‌ 23 నుంచి 26 వరకు తొమ్మిదో తరగతి వరకు విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దడం, ఫలితాలు విడుదల చేయడం, వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశాలు తదితర పనులను ముగించాలని సూచించింది. వేసవి సెలవులు తర్వాత పాఠశాలలు తెరవడంపై తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

Tags:    

Similar News