Opposition Meeting: పాట్నాలో ముగిసిన విపక్షాల ఐక్యతా భేటీ.. బీజేపీని ఓడించడమే ఉమ్మడి లక్ష్యంగా..
Opposition Meeting: వచ్చే నెల మరోసారి సిమ్లాలో భేటీ కావాలని నిర్ణయం
Opposition Meeting: పాట్నాలో ముగిసిన విపక్షాల ఐక్యతా భేటీ.. బీజేపీని ఓడించడమే ఉమ్మడి లక్ష్యంగా..
Opposition Meeting: BJPని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ కలిసి ఎన్నికల్లో పోరాడుతాయన్నారు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో సుమారు 15 పార్టీలు సమావేశమై కీలక చర్చలు జరిపారు. వచ్చే నెల మరోసారి సిమ్లాలో భేటీ అవుతామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ సమావేశంలోనే ఉమ్మడి అజెండాను రూపొందించుకుంటామన్నారు. విపక్షాల్లో ఎన్ని విభేదాలున్నా... కలిసే పోరాడుతామన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 17 పార్టీలు కలిసే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని, బీజేపీని ఓడించడమే ఉమ్మడి లక్ష్యమని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.