Maha Kumbh 2025: మహా కుంభ మేళాలో స్నానం చేయలేదు కానీ.. 93ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ జాబ్స్ భార్య..!

Maha Kumbh 2025: ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయిన ఆపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పవెల్ జాబ్స్ ఇటీవల ప్రయాగరాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో పాల్గొన్నారు.

Update: 2025-01-27 07:16 GMT

Maha Kumbh 2025: మహా కుంభ మేళాలో స్నానం చేయలేదు కానీ.. 93ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ జాబ్స్ భార్య..!

Maha Kumbh 2025: ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయిన ఆపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పవెల్ జాబ్స్ ఇటీవల ప్రయాగరాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో పాల్గొన్నారు. తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చడానికి ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఆమె సంగమంలో స్నానం చేయలేకపోయారు. అయినప్పటికీ, ఆమె ఈ ఉనికితో మొత్తం మహాకుంభ మేళాలో చర్చనీయాంశంగా నిలిచారు.

ఇది ఆసక్తికరమైన విషయం.. ఎందుకంటే లారెన్ జాబ్స్ ప్రయాగరాజ్ చేరుకున్న పద్ధతి కూడా 93 సంవత్సరాల పాత రికార్డును తిరగరాసింది. వాస్తవానికి, 93 సంవత్సరాల క్రితం ప్రయాగరాజ్ లోని విమానాశ్రయంలో మొదటి అంతర్జాతీయ విమానం ల్యాండ్ అయింది. ఇప్పుడు, లారెన్ జాబ్స్ కోసం భూటాన్ ఎయిర్‌వే విమానం ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మహాకుంభ మేళా ముగిసిన తర్వాత, ఆమె అదే విమానంలో భూటాన్ తిరిగి వెళ్లారు. ఇది ప్రయాగరాజ్ వచ్చిన 93 సంవత్సరాల తర్వాత మూడవ అంతర్జాతీయ విమానం అని చెప్పవచ్చు, ఈ ఘటన ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌కి మరొక ప్రత్యేక మైలురాయి అవుతుంది.

స్టీవ్ జాబ్స్‌కి పంపిన లెటర్‌

స్టీవ్ జాబ్స్ 23 ఫిబ్రవరి 1974 న తన బాల్య స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కి ఒక లెటర్ రాసి, భారతదేశంలో జరిగే కుంభ మేళాలో పాల్గొనే ఆలోచనను వ్యక్తం చేశారు. "నేను ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంబ్ మేళాకు హాజరయ్యాలని అనుకుంటున్నాను. మార్చ్‌లోనే నేను వస్తాను, కానీ సమయం ఖచ్చితంగా చెప్పలేను" అని ఆ లెటర్‌లో జాబ్స్ పేర్కొన్నారు. ఇటీవల ఈ లెటర్ వేలంలో 4.32 కోట్ల రూపాయలకు అమ్ముడైందన్న వార్త వచ్చింది. స్టీవ్ జాబ్స్ స్వయంగా మహాకుంబ్ మేళాకు రాలేకపోయినప్పటికీ, తన ఆధ్యాత్మిక ధోరణి కారణంగా ఉత్తరాఖండ్‌లోని నిహమ్ కరోలి బాబా ఆశ్రమంలో సందర్శన చేసేందుకు వెళ్లారు. అయితే, ఆయన కోరికను నెరవేర్చడానికి ఆయన భార్య లారెన్ పవెల్ జాబ్స్ ప్రయాగరాజ్ వచ్చి ఒక విశేష రికార్డును నెలకొల్పారు.

Tags:    

Similar News