Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ముగిసిన క్లూస్‌టీం విచారణ..
Falaknuma Express: కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తింపు
Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ముగిసిన క్లూస్‌టీం విచారణ..
Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై క్లూస్‌టీం విచారణ పూర్తైంది. ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం.. ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించింది క్లూస్ టీమ్. S-4 బోగీలోని బాత్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు గుర్తించింది. అక్కడ నుంచి ఇతర బోగీలకు మంటలు వ్యాపించాయని అధికారులు చెబుతున్నారు. S4 బోగీలోని కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు క్లూస్ టీమ్ అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక.. ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.