షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్.. ఎలాంటి ఆధారాలు లేవని...

Aryan Khan - Mumbai Drugs Case: పూర్తిస్థాయి నివేదికకు మరికొంత సమయం...

Update: 2022-03-02 07:40 GMT

షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్.. ఎలాంటి ఆధారాలు లేవని...

Aryan Khan - Mumbai Drugs Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తీరంలోని నేవీలో డ్రగ్స్‌ కేసులో కీలక విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ తనయుడు అర్యన్‌ ఖాన్‌ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ వాట్సాప్‌ చాట్‌లో ఎలాంటి డ్రగ్‌ ముఠాల ఆనవాళ్లు లేవని సిట్‌ చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని బెయిల్‌ మంజూరు చేసే సమయంలోనూ బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆర్యన్‌తోపాటు ఈ కేసులో అరెస్టయి మున్‌మున్‌ ధమేచా, అర్బజ్‌ మర్చంట్‌ వాట్సాప్‌ చాట్‌లలోనూ విషయం ఏమీ లేదని న్యాయస్థానం తెలిపింది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నిబంధనల ప్రకారం తనిఖీలను వీడియో రియార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ముంబై తీరంలోని క్రూజ్‌లో దాడులు చేసిన సమయంలోఎన్‌సీబీ వీడియో రికార్డింగ్‌ చేయలేదు. పైగా ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సిట్‌కు లభించలేదు. అయితే సిట్‌ విచారణ ఇంకా పూర్తి కాలేదు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంని ఎన్‌సీబీ డైరెక్టెర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు.

ముంబై క్రూయిజ్‌ కేసులో గతేడాది అక్టోబర్‌ 2న అర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఆధ్వర్యంలోని ముంబై బృందం ముంబై తీరంలోని క్రూజ్‌పై దాడులు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు. పలుమార్లు వాదనలు విన్న కోర్టు అక్టోబరు 28న ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ మొత్తం 26 రోజుల పాటు జైలులో ఉన్నాడు.

Tags:    

Similar News