నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో సౌత్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం

* హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు * సీఎం కేసీఆర్‌కు బదులు హోంమంత్రి మహమూద్‌ అలీ రాక

Update: 2021-11-14 02:11 GMT

నేడు అమిత్‌షా నేతృత్వంలో సౌత్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం(ఫైల్ ఫోటో)

Southern State Council Meeting: ఇవాళ మధ్యాహ్నం తిరుపతిలో సౌత్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అమిత్‌షా నిన్న సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరవడంలేదు. ఆయన బదులు హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ సొంత నియోజకవర్గం పర్యటనకు వెళ్తున్నారు.

స్టాలిన్‌కూడా హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేరళ నుంచి ఆర్థిక మంత్రి, సీఎస్‌ హాజరుకానున్నారు. లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎస్‌లు, ముఖ్య అధికారులు శనివారమే తిరుపతికి చేరుకున్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి హాజరుకానున్నారు.

దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు ఏడున్నాయి. విభజన చట్టం అంశాలపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 

Tags:    

Similar News