సోనియా అధ్యక్షతన ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశం

*పార్టీలో అంతర్గతంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు

Update: 2022-05-17 06:43 GMT

సోనియా అధ్యక్షతన ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశం

Congress: సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. నవసంకల్ప్ శిబిర్‌లో చేసిన తీర్మానాలపై చర్చించనున్నారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్ధండులతో సలహా మండలిని ఏర్పాటు చేయనున్నారు.

పార్టీ పరంగా ఎదురయ్యే రాజకీయ పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 15 తేదీనుంచి జనజాగరణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి, నిర్వహణకు సంబంధించిన సాధకబాదకాలపై సుధీర్ఘంగా చర్చించారు.

Tags:    

Similar News