Sonia Gandhi: గ్యారెంటీ స్కీమ్‌లను అనౌన్స్ చేసిన సోనియా గాంధీ
Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల కోసం టీకాంగ్రెస్ కీలక హామీలు
Sonia Gandhi: గ్యారెంటీ స్కీమ్‌లను అనౌన్స్ చేసిన సోనియా గాంధీ
Sonia Gandhi: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ కీలక హామీలను ప్రకటించింది. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో.. గ్యారెంటీ స్కీమ్‌లను అనౌన్స్ చేశారు సోనియా గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాల మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం చేస్తామన్నరు. అలాగే 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
రైతు భరోసా కింద ఎక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి 15వేల నగదు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం కోసం మొదటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని,, గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించారు సోనియా.