Meghalaya honeymoon murder: క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చేందుకు ఎంత క‌న్నింగ్ ప్లాన్‌.. హ‌నీమూన్‌లోనే మ‌ర‌ణ శాస‌నం

Meghalaya honeymoon murder: మేఘాలయలో ఇటీవల చోటుచేసుకున్న హనీమూన్ ట్రాజెడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. వివాహం అయి కేవలం నాలుగు రోజుల్లోనే భార్య భర్తను హత్య చేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం పోలీసుల విచార‌ణ‌లో ఒక్కో నిజం వెలుగులోకి వ‌స్తోంది.

Update: 2025-06-10 05:23 GMT

వివ‌రాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లాడు. అయితే జూన్ 2న రాజా మృతదేహాన్ని ఒక లోతైన ప్రాంతంలో గుర్తించారు. మొద‌ట అతను దొంగల దాడిలో మరణించి ఉంటాడని అనుకున్నారు. కానీ విచారణ సాగుతూ, ఇది ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జ‌రిగిన హ‌త్య అని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రాజా మృతదేహం లభించిన తరువాత నుంచి కనిపించకుండా పోయిన సోనమ్‌ను పోలీసులు జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ వద్ద అరెస్టు చేశారు. మేఘాలయ పోలీసులు ఆమెను ప్రస్తుతం షిల్లాంగ్‌కు తీసుకెళ్తున్నారు. 72 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌లో భాగంగా ఆమెను విచారిస్తున్నారు.

సోనమ్ తన ప్రేమికుడు రాజ్‌తో కలిసి రాజా రఘువంశీని హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ వేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల న‌లుగురిని ఇందుకోసం నియ‌మించుకున్నారు. పోలీసుల ప్ర‌కారం ఈ నిందితుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆకాష్ రాజ్‌పుత్ (లలిత్‌పూర్, 21), విశాల్ సింగ్ చౌహాన్ (ఇండోర్, 22), రాజ్ కుష్వాహా (ఇండోర్, 21), ఆనంద్ కుర్మి (సత్నా, 23). ఈ నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు అవసరమైన ఆయుధాలను గౌహతిలో కొనుగోలు చేసినట్టు తెలిసింది.

పూర్తి ప్రయాణంలో సోనమ్ తన లోకేషన్ వివరాలు ప్రేమికుడు రాజ్‌కు పంపిస్తూ ఉండేది. కామాఖ్య దేవాలయ సందర్శన తర్వాత హంతకులు జంటను అనుసరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మేఘాలయ టూరిస్ట్ గైడ్ ఆల్బర్ట్ పాడె ఇచ్చిన సమాచారం ఈ కేసులో కీల‌కంగా మారింది. మే 23న సోనమ్, రాజా మరో ముగ్గురితో కలిసి మౌలాఖియాత్‌కు వెళ్లిన సమయంలో గైడ్ వారిని ఫాలో అయ్యాడని చెప్పాడు.

అయితే సోనమ్ తన భర్తను చంపిన విష‌యాన్ని ఇంకా అంగీకరించలేదు. ఆమె పోలీసులకు, ‘‘రాజాను దొంగలు చంపారు, నగలు కోసమే హత్య చేశారు,’’ అని చెప్పింది. అయితే పోలీసులు మాత్రం ఇది ముందుగానే చేసిన ప్లాన్, ప్రేమ వ్యవహారం కారణంగానే జరిగిన హత్య అని చెబుతున్నారు.

Tags:    

Similar News