Tamil Nadu: ఊటీలో ఘోర ప్రమాదం..ఆరుగురు కార్మికులు మృతి
Tamil Nadu: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది.
Tamil Nadu: ఊటీలో ఘోర ప్రమాదం..ఆరుగురు కార్మికులు మృతి
Tamil Nadu: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.