Sitaram Yechury: సీపీఎం నేత సీతారం ఏచూరి కుమారుడు కరోనాతో మృతి
Sitaram Yechury: తనయుడు ఆశిష్ ఏచూరి మరణవార్తను ట్వీట్ ద్వారా సీతారాం ఏచూరి వెల్లడించారు.
Sitaram Yechury:(File Image)
Sitaram Yechury: కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొందరు కరోనాను జయిస్తుండగా, మరికొందరు కరోనాతో పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో పెను విషాదం నెలకొంది. ఇటీవల కరోనా బారిన పడిన ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి(34) కన్నుమూశారు.
తనయుడు ఆశిష్ ఏచూరి మరణవార్తను ట్వీట్ ద్వారా సీతారాం ఏచూరి వెల్లడించారు. 'ఇది చాలా బాధాకరం. నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో పోరాడుతూ నేటి ఉదయం కన్నుమూశాడు. ఆశిష్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ' సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
ఆశిష్ ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ బాధాకర సమయంలో ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరోతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు ప్రముఖులు ఏచూరి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.