ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం : Nirmala Sitharaman

Update: 2020-02-01 06:08 GMT
నిర్మలా సీతారామన్

ఒకే దేశం, ఒకే పన్ను విధానం మంచి ఫలితాన్నిచ్చిందని నిర్మాలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తామన్నారు. ఇన్ స్పెక్టర్ రాజ్ కు కాలం చెల్లిందనీ, అందులో భాగంగానే పలు చెక్ పోస్టులను ఎత్తివేశామన్నారు.

అలాగే ప్రజలపై దాదాపు పది శాతం వరకూ పన్నుభారం తగ్గిందన్నారు. అలాగే జీఎస్టీ వల్ల గత రెండేళ్లలో కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపు దారులు పెరిగారని వివరించారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని చెప్పారు. ఈ ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్స్ మరింత సులభతరం అయిందన్నారు. 

Tags:    

Similar News