Ulta Pani Video: ఎగువ నుండి దిగువకు వచ్చే నీరు.. కాగితపు పడవ వేసి చిన్నపిల్లాడిలా సంబరపడిన మంత్రి

Ulta Pani Video: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మూడు రోజులపాటు చత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్నారు.

Update: 2025-07-09 07:46 GMT

Ulta Pani Video: ఎగువ నుండి దిగువకు వచ్చే నీరు.. కాగితపు పడవ వేసి చిన్నపిల్లాడిలా సంబరపడిన మంత్రి

Ulta Pani Video: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మూడు రోజులపాటు చత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన నిన్న ఒక దృశ్యాన్ని చూసి చిన్నపిల్లాడిలా సంబరిపడిపోయారు. చిన్నపిల్లలు వేసినట్లు నీటిలో కాగితపు పడవ వేసి అమితానందం పొందారు. దీనికి సంబందించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా నీరు ఎత్తు నుంచి పల్లానికి వస్తుంది. కానీ చత్తీస్ ఘడ్‌లోని మైన్‌పట్‌ ప్రాంతంలో అలా కాదు. పల్లం నుంచే ఎత్తుకు వెళుతుంది. అందుకే నీరు ఎలా వెళుతుందో చూడాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక కాగితపు పడవను ఆ నీటిలో వేసారు. ఇంకేంముందు అది చక్కగా పల్లం నుండి ఎత్తులోకి వెళుతుంది. ఇది చూసిన శివరాజ్ సింగ్ ఎంతో సంబరిపడిపోయారు. దీనికి సంబంధించిన పోస్ట్‌లను ఆయనే తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

చత్తీస్ ఘడ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి శివరాజ్ సింగ్ అన్ని ఊళ్లు తిరిగి, సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే మైన్ పట్ ప్రాంతానికి రాగానే అక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు వెళుతుందని తన పక్కన ఉన్న అధికారులు చెప్పడంతో అది ఎలా వెళుతుందో చూడాలనుకున్నారు. వెంటనే ఆయనకు ఒక అధికారి కాగితపు పడవ చేసి ఇచ్చారు. దీన్ని మంత్రి ఆ నీటిలో వేయడంతో అది పల్లం నుంచి చక్కగా ఎత్తుకు వెళ్లిపోయింది. ఇది చూసిన మంత్రి శివరాజ్ సింగ్ తెగ సంబరిపడిపోయారు.

ఈ సంఘటనకు సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియాలో పెడుతూ శివరాజ్ సింగ్.. నిజంగా మన చత్తీస్ ఘడ్ ఒక అద్బుతం. ఇక్కడ నీరు కింద నుంచి పైకి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి అనుభవాన్ని చూడలేదు.. దీన్ని వెనుక ఎలాంటి సైన్స్ ఉన్నప్పటికీ ఈ రహస్యం ఎంతో ఆసక్తిగా ఉందని అన్నారు.


Tags:    

Similar News