అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు..!

Update: 2020-05-21 11:58 GMT

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేస్తుంగా పెద్దసంఖ్యలో ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆలయ నిర్మాణ పనుల కోసం పది రోజులుగా ఇక్కడ ల్యాండ్ లెవలింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా పురాతన విగ్రహాలు, స్తంభాలు బయటపడుతున్నాయి.

తాజాగా శివలింగం సహా పిల్లర్లు, ఇసుక స్తంభాలు గుర్తించిట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. ల్యాండ్ లెవలింగ్ పనుల్లో భాగంగా తవ్వకాల్లో 5 అడుగుల శివలింగం, 7 బ్లాక్ స్టోన్ తోనే ఉన్న స్తంభాలు, 6 ఇసుక స్తంభాలు బయటపడ్డాయి అని అన్నారు. కాగా గతంలోనూ జరిపిన తవ్వకాల్లో ఇలాంటి బయపడ్డాయని బీజేపీ నేత రాంమాధవ్ చెప్పారు.

Tags:    

Similar News