Baba Ramdev: మనిషి ఆయుష్షు 200 ఏళ్లు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
Baba Ramdev: ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తు మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Baba Ramdev: మనిషి ఆయుష్షు 200 ఏళ్లు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
Baba Ramdev: ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తు మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో యాంటీ ఏజింగ్ మందుల వాడకం గురించి విస్తృత చర్చ మొదలైంది. దీనిపై యోగ గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా మాట్లాడుతూ.. “మనిషి సహజ ఆయుష్షు 100 ఏళ్లు కాదు. సరైన ఆహారం, యోగా, క్రమశిక్షణతో 150 నుంచి 200 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు” అని తెలిపారు. తనకు 60 ఏళ్లు దాటినా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం, యోగా, జీవనశైలికి ఫలితమే అని చెప్పారు.
సిద్ధార్థ్ శుక్లా మరణం, ఇప్పుడు షెఫాలీ జరీవాలా మృతి నేపథ్యంలో మాట్లాడుతూ..“వారి శరీరం (హార్డ్‌వేర్) బాగున్నా, అంతర్గతంగా (సాఫ్ట్‌వేర్) తీవ్ర సమస్యలు ఉన్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపించినా, శరీర వ్యవస్థ దెబ్బతినటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి” అని అభిప్రాయపడ్డారు. అంతర్గత ఆరోగ్యం, సహజ జీవనశైలి ఎంత ముఖ్యమో గుర్తు చేశారు.
మరోవైపు, షెఫాలీ జరీవాలా మృతి కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ముంబైలోని ఆమె నివాసంలో రెండు పెట్టెల నిండా మందులు ఉన్నట్లు గుర్తించారు. అందులో గ్లూటాథియోన్ ఇంజెక్షన్లు, విటమిన్ C ఇంజెక్షన్లు, యాంటీ-ఏజింగ్ మందులు, ఎసిడిటీ మాత్రలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
గత ఏడెనిమిదేళ్లుగా వైద్య పర్యవేక్షణ లేకుండా షెఫాలీ ఈ చికిత్సలు తీసుకుంటున్నట్లు సమాచారం. శరీరంలోని సహజ జీవనచక్రం దెబ్బతినడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదాలు జరుగుతాయని రాందేవ్ బాబా హెచ్చరించారు.