Vaibhav Suryavanshi: వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలి.. అతడు మరో సచిన్: శశి థరూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Vaibhav Suryavanshi: కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమానిగా పేరున్న శశి థరూర్ వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ.

Update: 2025-12-25 10:30 GMT

Vaibhav Suryavanshi: వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలి.. అతడు మరో సచిన్: శశి థరూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Vaibhav Suryavanshi: భారత దేశవాళీ క్రికెట్‌లో దూసుకుపోతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు చేసిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమానిగా పేరున్న శశి థరూర్ వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ,

"14 ఏళ్ల వయసులో ఇంతటి అద్భుతమైన ప్రతిభ కనబరిచినది సచిన్. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మనం ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నాం? వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలి," అని పేర్కొన్నారు.



అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో వైభవ్ విఫలమవడంతో అతని టెంపర్‌మెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా బీహార్ జట్టు 574/6 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.

మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వైభవ్‌పై స్పందించాడు.

"వైభవ్ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. రాబోయే ఐపీఎల్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే అతను భారత జట్టు తలుపు తట్టడం ఖాయం," అని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న వైభవ్‌కు రాబోయే ఐపీఎల్ సీజన్ ఎంతో కీలకం కానుంది. పెరిగిన అంచనాల మధ్య అతను ఎలా రాణిస్తాడో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News