Shashi Tharoor on Congress New Chief: కాంగ్రెస్ కు పూర్తి కాలపు అధ్యక్షుడు అవ‌స‌రం: శ‌శిథ‌రూర్‌

Shashi Tharoor on Congress New Chief: కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం లేదనే భావనను తొలగించేందుకు పూర్తి కాలపు అధ్యక్షుడు అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Update: 2020-08-09 16:35 GMT
Shashi Tharoor says Congress needs to find new chief

Shashi Tharoor on Congress New Chief: కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం లేదనే భావనను తొలగించేందుకు పూర్తి కాలపు అధ్యక్షుడు అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న పరిస్థితులను చక్క బెట్టి, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌కి కొత్త చీఫ్ అవసరమని అన్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఆ బాధ్యతలను నిరవధికంగా, అపరిమితంగా నిర్వహించాలని ఆశించడం అన్యాయమని చెప్పారు. అలాగే.. చుక్కాని లేని నావ, మార్గదర్శనం లేని పార్టీ అనే భావనను తిప్పికొట్టేందుకు పూర్తి కాలపు అధ్యక్షుడిని అన్వేషించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

తాత్కాలిక ప్రెసిడెంట్‌గా సోనియా జీ నియామకానికి తాను మద్దతుగా నిలిచారని, కానీ ఎప్పుడూ ఆవిడే బాధ్యతలు మోయాలనుకోవడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్‌ను నడిపించే సామర్థ్యం రాహుల్‌కి ఉందని అయితే ఆ పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరిస్తే.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు పార్టీ తన ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అనంత‌రం రాహుల్ గాంధీ అనేక చ‌ర్చ‌లు జ‌రిగినా‌..పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరించ‌డంతో సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా గత ఏడాది ఆగస్టు 10న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశి థరూర్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి. 

Tags:    

Similar News