Maharashtra Politics: మహారాష్ట్రలో వేగంగా మారతున్న రాజకీయ పరిణామాలు..
Maharashtra Politics: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారతున్నాయి.
Maharashtra Politics: మహారాష్ట్రలో వేగంగా మారతున్న రాజకీయ పరిణామాలు..
Maharashtra Politics: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారతున్నాయి. రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ శరద్ పవార్ శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు.
మలబార్ హిల్స్ లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్ష బంగ్లాలో వీరి భేటీ జరిగింది. మరాఠా రిజర్వేషన్ల తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలవేళ కొత్త పొత్తులకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.