Sharad Pawar: ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి
Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
Sharad Pawar: ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి
Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో యాంటి-ఈవీఎం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేకపోయినా ఓటు వేశారన్నారు.
అమెరికా, ఇంగ్లాండ్‌తో సహా ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో భారత్‌లోనూ బ్యాలెట్‌లతోనే ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై స్థానిక ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందజేయాలని వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తానని తెలిపారు శరద్ పవార్.