Maharashtra: ఘోర అగ్నిప్రమాదం.. క్లాత్‌స్టోర్‌లో చెలరేగిన మంటలు, ఏడుగురు సజీవదహనం
Maharashtra: మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు
Maharashtra: ఘోర అగ్నిప్రమాదం.. క్లాత్‌స్టోర్‌లో చెలరేగిన మంటలు, ఏడుగురు సజీవదహనం
Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి షంబాజీ నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ క్లాత్ స్టోర్‌లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
అయితే అప్పటికే ఏడుగురు మృతి చెందినట్లు ఐడెంటిఫై చేశారు. ఇక నివాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.