Covishield Vaccine: కొవిషీల్డ్‌ మార్కెటింగ్‌ అనుమతికి సీరం దరఖాస్తు

* 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేశామని వెల్లడి

Update: 2021-10-26 02:57 GMT

కొవిషీల్డ్‌ మార్కెటింగ్‌ అనుమతికి సీరం దరఖాస్తు(ఫైల్ ఫోటో)

Covishield Vaccine: భారత్‌లో కొవిషీల్డ్‌ టీకా రెగ్యులర్‌ మార్కెటింగ్‌కు అనుమతి ఇవ్వాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తు చేసుకుంది. భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు 100 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను సరఫరా చేయడాన్ని ఎస్‌ఐఐ తన దరఖాస్తులో ప్రముఖంగా ప్రస్తావించింది. కొవిషీల్డ్‌ను పుణెకు చెందిన ఎస్‌ఐఐ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే.

దేశంలోని కరోనా వ్యాక్సిన్‌ తయారీదారులతో ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల కిందట సమావేశం నిర్వహించిన నేపథ్యంలో డీసీజీఐకు ఎస్‌ఐఐ దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం కొవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతి ఉంది. దానికి రెగ్యులర్‌ మార్కెటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తే ప్రపంచంలో అలాంటి ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్‌ అవుతుంది.

Tags:    

Similar News