Obulapuram Mining Case: ఓఎంసీ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు..గాలి జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురికి శిక్ష ఖరారు
Obulapuram Mining Case: ఓఎంసీ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు..గాలి జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురికి శిక్ష ఖరారు
Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గాలి జనార్థన్ రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు..కృపానంద, సబితా ఇంద్రారెడ్డిని నిర్ధోషిగా తేల్చుతూ తీర్పునిచ్చింది. గాలి జనార్థన్ రెడ్డి సహా ఐదుగురికి శిక్షను ఖరారు చేసింది. A1 శ్రీనివాస్ రెడ్డి , A2 గాలి జనార్దన్ రెడ్డి , A3 రాజగోపాల్ , A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A7 అలీఖాన్ లను దోషులుగా తేల్చింది కోర్టు.
గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే, దోషులకు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకు రూ.2లక్షలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏళ్ల పాటు అతడికి జైలు శిక్ష పడినట్లయింది.