Umesh Pal: ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో సంచలన తీర్పు

Umesh Pal: అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు

Update: 2023-03-28 09:21 GMT

Umesh Pal: ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో సంచలన తీర్పు

Umesh Pal: ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అతిక్‌తో మరో ఇద్దరికి జీవిత ఖైదీ విధించింది. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. అతిక్‌ సోదరుడు అష్రఫ్‌ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. సుమారు 17 ఏళ్ల నాటి కిడ్నాప్‌ కేసులో నేడు కోర్టు తీర్పు వెలువరించింది.

గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్ 1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ఉత్తరప్రదేశ్ లోని ఫూల్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా పనిచేశారు. 1962 ఆగస్టు 10న జన్మించిన అతిక్ అహ్మద్ పేరు వందకు పైగా కేసుల్లో ఉంది.

అతిక్ అహ్మద్ తొలిసారి 1989 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1993లో సమాజ్ వాదీ పార్టీలో చేరిన ఆయన... 1999లో అప్నాదళ్ లో చేరారు. 2003లో అప్నాదళ్ ను వీడి తిరిగి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

Tags:    

Similar News