అక్టోబర్ 5 వరకు విద్యాసంస్థలు తెరవొద్దు..

కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఆన్‌లైన్ బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు..

Update: 2020-09-18 11:30 GMT

కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, ఆన్‌లైన్ బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి అని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) జారీ చేసిన అధికారిక ఉత్తర్వు తెలిపింది. జూన్ 8 నుండి మొదటి 'అన్‌లాక్' లో వివిధ దశలలో అనేక ఆంక్షలు సడలించగా, విద్యాసంస్థలపై ఆంక్షలు అలాగే కొనసాగాయి.

అయితే 'అన్‌లాక్' 4.0 కింద తాజా మార్గదర్శకాల ప్రకారం, పాఠశాలలు 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సెప్టెంబర్ 21 నుండి విద్యార్థులను స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు అనుమతించింది కేంద్ర ప్రభుత్వం.. కానీ కేంద్రం ఇచ్చిన సడలింపును ఢిల్లీ ప్రభుత్వం పక్కనపెట్టేసి.. అక్టోబర్ 5 వరకు విద్యాసంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలలను మార్చి 16 నుండే మూసివేశారు. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. 

Tags:    

Similar News