Delhi Pollution: ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

Delhi Pollution: 379 పాయింట్లుగా గాలి నాణ్యత

Update: 2021-11-17 02:16 GMT

ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం (ఫైల్ ఇమేజ్)

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5పై సగటున 379 పాయింట్లుగా గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అమలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా రోడ్లపై వాహనాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రరూపం దాల్చడంతో నిర్మాణాలను నిలిపివేశారు.

తాజగా ఢిల్లీ NCR పరిధిలో ఉన్న యూపీలోని నోయిడాలో అన్ని రకాల నిర్మాణ పనులు, RMC, హాల్ మిక్స్‌ప్లాంట్లు, డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నాలుగు రోజుల పాటు గ్రేటర్ నోయిడా అథారిటీ నిషేధించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనల మేరకు అధికార యంత్రంగం చర్యలు చేపట్టింది. స్టేషన్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైలు కార్పొరేషన్ సేవలను మినహాయించి నవంబర్ 21 వరకు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని కమిషన్ ఢిల్లీ, NCR రాష్ట్రాలను ఆదేశించింది. 

Tags:    

Similar News