Odisha Train Accident: కన్నీళ్లు పెట్టిస్తున్న ఒడిశా రైలు ప్రమాద దృశ్యాలు..ఓ తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతం..

Odisha Train Accident: శవాల గుట్టల్లో కన్న కొడుకు మృతదేహం కోసం వెతుకులాట

Update: 2023-06-04 05:15 GMT

Odisha Train Accident: కన్నీళ్లు పెట్టిస్తున్న ఒడిశా రైలు ప్రమాద దృశ్యాలు..ఓ తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతం..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదాన్ని తల్చుకుంటే ఎవరికైనా కన్నీళ్లు రాక మానదు. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ దృశ్యాలే కన్పిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోనే తన కొడుకు ప్రయాంచాడని..కానీ బతికి ఉన్నాడో లేడో తెలియడంలేదని గద్గద స్వరంతో మాట్లాడుతున్న మాటలు అందరి గుండెలను పిండేస్తున్నాయి. కన్న కొడుకు అసలు బతికి ఉన్నాడో లేక చనిపోయాడో తెలియక బిక్క మొహం వేసుకొని ఆ శవాల గుట్టల్లో వెతుకుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తన కొడుకు బతికి ఉంటే..ఫోన్ చేసేవాడని..కానీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఒకవేళ చనిపోయాడేమో అన్న అనుమానంతో మృతదేహం కోసం వెతుకుతున్నా...దొరకడంలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు.

ఒడిశా రైలు ప్రమాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు సుమారు 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా బాలాసోర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు అందరిని కలిచివేస్తున్నాయి. అంతేకాదు..రైలు ప్రమాదంలో బోగీల్లో ఇరుక్కొని..చాలా మంది చనిపోవడంతో వారి మృతదేహాలను తరలించేందుకు ట్రాక్టర్లు, చిన్నపాటి ట్రాలీలను వినియోగించారు. వాహనాల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానదు. 

Tags:    

Similar News