SBI: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కస్టమర్లకు విధించే ఛార్జీలను మార్చింది.

Update: 2021-05-25 16:15 GMT

ఎస్‌బీఐ బ్యాంక్ (ఫొటో ట్విట్టర్)

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కస్టమర్లకు విధించే ఛార్జీలను మార్చింది. ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈమేరకు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో సవరించిన ఛార్జీలను పొందుపరిచింది.

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ను అందిస్తుంది. ఒక నెలలో 4 సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+GST వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో 4 సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసేందుకు అవకాశం ఉంది.

ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+GST, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+GST చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+GST చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు.

ఇక ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు.

Tags:    

Similar News