SBI ఖాతాదారులకు గమనిక..! డిసెంబర్‌1 నుంచి ఆ కస్టమర్లకు అదనపు ఛార్జీలు..

* క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అన్ని EMI లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము, పన్ను చెల్లించాలి.

Update: 2021-11-14 05:19 GMT

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఫైల్ ఫోటో)

SBI Credit Card: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్రెడిట్‌ కార్డులు వాడుతున్న కస్టమర్లు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అన్ని EMI లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము, పన్ను చెల్లించాలి. దీని గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (SBICPSL) పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు తెలిపింది.

కొత్త మార్గదర్శకాలు డిసెంబర్ 1, 2021 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ కస్టమర్‌లు గమనించాలి. రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో జరిగే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఇఎంఐ) లావాదేవీలపై ఈ ప్రాసెసింగ్ రుసుమును విధిస్తున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. నవంబర్ 12, శుక్రవారం రోజు ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఈ-మెయిల్ ద్వారా ఎస్‌బిఐ నోటిఫికేషన్ పంపింది. ఇందులో ఇలా పేర్కొంది.

"డియర్ కార్డ్ హోల్డర్స్, డిసెంబర్ 01, 2021 నుంచి మర్చంట్ అవుట్‌లెట్‌లు/వెబ్‌సైట్‌లు/యాప్‌లలో చేసే అన్ని EMI లావాదేవీలకు ప్రాసెసింగ్ ఫీజుగా 99+ వర్తిస్తాయి. మీ నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మర్చంట్ EMI ప్రాసెసింగ్ ఫీజు గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి అంటూ SBI ఒక లింక్ ఇచ్చింది.

ఎంత అదనపు ఛార్జీ చెల్లించాలి.

అప్‌డేట్ ప్రకారం EMI లావాదేవీలుగా మార్చబడిన లావాదేవీలపై మాత్రమే ప్రాసెసింగ్ రుసుము రూ. 99 వసూలు చేస్తారని క్రెడిట్ కార్డ్ వినియోగదారులు గమనించాలి. EMI లావాదేవీ విఫలమైతే లేదా రద్దు చేయబడితే ప్రాసెసింగ్ ఫీజు రీఫండ్ చేస్తామని SBI తెలిపింది. నివేదికల ప్రకారం ఈ కొత్త చర్య ఇప్పుడే కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి పథకాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News