Sankranthi Special Trains: ఏపీ, తెలంగాణ మధ్య మరిన్ని సర్వీసులు.. ఏ ఏ రూట్లలో అంటే?
సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, అనకాపల్లి, కాగజ్‌నగర్ వెళ్లే రైళ్ల వివరాలు మరియు తాత్కాలిక హాల్ట్‌ల సమాచారం ఇక్కడ చూడండి.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, విజయవాడ, అనకాపల్లి మరియు సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గాల్లో అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు చుట్టుపక్కల స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్‌లను కేటాయించింది.
1. హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (07469/07470)
ఈ మార్గంలో జనవరి 9 మరియు 10 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
ట్రైన్ నెం. 07469: ఉదయం 7:55కు హైదరాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 2:15కు కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 07470: మధ్యాహ్నం 3:15కు కాగజ్‌నగర్‌లో బయలుదేరి, రాత్రి 10:20కు హైదరాబాద్ చేరుకుంటుంది.
స్టాపింగ్స్: సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి. (గమనిక: ఇందులో కేవలం జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి).
2. హైదరాబాద్ – విజయవాడ (07471/07472)
ట్రైన్ నెం. 07471: జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6:10కు హైదరాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 1:40కు విజయవాడ చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 07472: మధ్యాహ్నం 2:40కు విజయవాడలో బయలుదేరి, రాత్రి 10:35కు హైదరాబాద్ చేరుకుంటుంది.
స్టాపింగ్స్: చర్లపల్లి, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర.
3. చర్లపల్లి – అనకాపల్లి (07097/07098)
జనవరి 14, 15 తేదీల్లో ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
ట్రైన్ నెం. 07097: జనవరి 14న రాత్రి 7:30కు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:30కు అనకాపల్లి చేరుకుంటుంది.
ట్రైన్ నెం. 07098: జనవరి 15న సాయంత్రం 5:35కు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:15కు చర్లపల్లి చేరుకుంటుంది.
కోచ్‌లు: ఏసీ ఫస్ట్ క్లాస్, 2-టైర్, 3-టైర్, స్లీపర్ మరియు జనరల్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.
సికింద్రాబాద్ రద్దీ తగ్గింపు: ఈ స్టేషన్లలో హాల్ట్‌లు!
సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు జనవరి 7 నుంచి 20 వరకు పలు కీలక రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్‌లు కల్పించారు.
హైటెక్ సిటీ: బీదర్, మచిలీపట్నం, నర్సాపూర్, షిర్డీ, కాకినాడ, వైజాగ్ వెళ్లే 16 రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
చర్లపల్లి: గూడూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, భువనేశ్వర్ మార్గాల్లో నడిచే 11 రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
లింగంపల్లి: ముంబై, పూణే, రాజ్‌కోట్, తిరుపతి వెళ్లే దూరప్రాంత రైళ్లు ఇక్కడ ఆగుతాయి.