Sushant Singh Rajput Case : ఎన్‌సిబి అదుపులో మరొకరు

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారణ వేగవంతం..

Update: 2020-09-04 05:20 GMT

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారణ వేగవంతం చేసింది. సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకుంది. అంతకుముందు మిరాండా ఇంటిని శోధించారు. ఇదిలావుండగా, ఎన్‌సిబి బృందం రియా చక్రవర్తి ఇంటిని కూడా శోధిస్తోంది. రియా , శామ్యూల్ ఇళ్ల వద్ద మొబైల్స్, హార్డ్ డిస్క్‌లు , ల్యాప్‌టాప్‌లను ఎన్‌సిబి బృందం పరిశీలించింది. రియా కారును కూడా స్వాధీనం చేసుకొని పరిశీలించారు.

ఇక డ్రగ్స్ కేసులో జైద్ విలాత్రా, అబ్దుల్ బాసిత్ పరిహార్ సహా 5 మందిని ఎన్‌సిబి ఇప్పటివరకు అరెస్ట్ చేసింది. రియా సోదరుడు షోవిక్.. మిరాండాతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా రియా సోదరుడు షోవిక్‌ను ఎన్‌సిబి ప్రశ్నించింది. ఈ క్రమంలో షోవిక్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అరెస్టైన జైద్ విలత్రాను గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌సిబి కోర్టు నుంచి 10 రోజుల రిమాండ్‌ కోరినప్పటికీ 9 రోజుల రిమాండ్‌ లభించింది. కాగా జైద్ సెప్టెంబర్ 1 న ముంబైలో అరెస్టు అయ్యారు. 

Tags:    

Similar News