కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా సచిన పైలట్?

Update: 2019-07-06 10:32 GMT

నాయకత్వ సంక్షోభంలో పడిన కాంగ్రెస్ లో కొత్త నేత కోసం వెతుకులాట ముమ్మరమవుతోంది. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రాహుల్ స్థానంలో వారసుని వేటపై పార్టీలోనే ఇప్పటి వరకూ ఏకాభిప్రాయం లేదు. దీంతో కొత్త నేత ఎంపిక వరకూ మధ్యే మార్గంగా కురువృద్దుడు మోతీలాల్ ఓరాను నియమించారు. అయితే ఇప్పుడు రాహుల్ స్థానంలో సచిన్ పైలట్ ను పార్టీ అద్యక్షుడిగా ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. పార్టీకి యువ నేత సారధ్యం వహించాలని సచిన్ పైలట్ అయితే బాగుంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధినేతగా సచిన్ పైలట్ ను ఎంపిక చేయాలంటూ అమరీందర్ చేసిన ట్వీట్ కు మద్దతు పెరుగుతోంది.

Tags:    

Similar News