Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నరేంద్రమోదీ నెక్లెస్.. దెబ్బకు రుచి గుజ్జార్ వరల్డ్ వైడ్‌ పాపులర్‌

Update: 2025-05-21 01:46 GMT

Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నరేంద్రమోదీ నెక్లెస్.. దెబ్బకు రుచి గుజ్జార్ వరల్డ్ వైడ్‌ పాపులర్‌

Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందాల ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. వెరైటీ దస్తువులు ధరించి ఆకట్టుకుంటున్నారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి అందరి ఫోకస్ తమపై ఉండేవిధంగా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన నటి గుజ్జర్ మోదీ నెక్లెస్ ధరించింది. దీంతో అందరి దృష్టి తనపై పడేవిధంగా చేసింది. కేన్స్ ఫెస్టివల్స్ కు హాజరైన అందరికీ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేయగా..ఆ కార్యక్రమానికి రుచి గుజ్జర్ లెహంగా వేసుకుని మెడలో మోదీ నెక్లెస్ ధరించింది. తన నెక్లెస్ కు బీజేపీ గుర్తు అయిన కమలం పువ్వులో మోదీ ఫొటోలు ఉన్న లాకెట్స్ వేసుకుని రుచి గుజ్జర్ రావడం చర్చనీయాంశంగా మారింది.

రుచి గుజ్జర్ వేసుకున్న ఈ లెహంగా, నెక్లెస్ లను రూప శర్మ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మోదీ నెక్లెస్ గురించి రుచి గుజ్జర్ మాట్లాడారు. ఈ డ్రెస్ మా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వేసుకున్నాను. నెక్లెస్ విషయానికి వస్తే ఇది కేవలం జ్యువెలరీ కాదు..ధైర్యం, ముందు చూపు, భారత్ ప్రపంచ వేదికలపై ముందుకు వెళ్తుందని గుర్తు. కేన్స్ లో ఇలా వేసుకోవడం నా ప్రధానికి గౌరవం ఇవ్వడం కోసమని పేర్కొంది. ఏది ఏకమైనప్పటికీ రుచి గుజ్జర్ మోదీ నెక్లెస్ తో కేన్స్ లో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పాలి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఫ్యాషన్ కు అడ్డా అని తెలిసిందే. అక్కడికి వచ్చేవాళ్లంతా కొత్త రకం డ్రెస్సులతో అలరిస్తుంటారు. 



Tags:    

Similar News