లక్షన్నర జీతం వస్తున్నా సరిపోవడం లేదంటున్న టెకీ... జనం రియాక్షన్ చూడండి

18 LPA Package: ఉపాధి కోసం పెద్ద పెద్ద మెట్రో నగరాలకు వస్తున్న చాలామంది చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నారు.

Update: 2025-03-18 15:20 GMT

లక్షన్నర జీతం వస్తున్నా సరిపోవడం లేదంటున్న టెకీ... జనం రియాక్షన్ చూడండి

Rs 1.5 Lakh salary is not enough to live Bengaluru

18 LPA Package: ఉపాధి కోసం పెద్ద పెద్ద మెట్రో నగరాలకు వస్తున్న చాలామంది చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, హోం లోన్ ఇఎంఐ, పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం పొదుపు... ఇలా తక్కువ జీతంలో ఎక్కువ బాధ్యతలు మోస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గొప్పగా బతకాలన్న ఆశ ఉన్నా... అందుకు సరిపడ ఆదాయం లేకపోవడంతో ఉన్నదాంతో రాజీపడి బతుకు బండి నెట్టుకొస్తున్నారు.

అయితే, తక్కువ జీతంతో ఇబ్బందిపడే వారి పరిస్థితి ఇలా ఉంటే... జీతం బాగానే ఉన్నప్పటికీ తమకు కూడా అలాంటి బాధలే ఉన్నాయంటున్నారు ఎక్కువ జీతం ఎత్తుతున్న కొంతమంది టెకీలు. తాజాగా ఇదే విషయమై బెంగళూరుకు చెందిన ఒక టెకీ రెడిట్ ద్వారా పంచుకున్న తన అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ సోషల్ మీడియా పోస్టులో ఆయన ఏం రాశారంటే... తన వయస్సు 26 ఏళ్లు. బెంగళూరులో ఉంటున్నాను. నెలకు లక్షన్నర జీతం ఎత్తుతున్నా. అయినప్పటికీ ఊర్లో అమ్మానాన్నలకు, ఇఎంఐలకు, ఇతర అన్నీ ఖర్చులు పోనూ రూ. 30,000 నుండి 40 వేల కంటే ఎక్కువ మిగలడం లేదు అని ఆ టెకీ ఆవేదన వ్యక్తంచేశారు.

మెట్రో నగరాల్లో బతుకు ఎందుకు అంత భారంగా ఉంటుందో చెప్పమంటారా అంటూ ఆ వ్యక్తి తన పోస్టును మొదలుపెట్టారు. లక్షన్నర జీతంలో అవసరాలు పోగా తను ఆశపడినట్లుగా జీవితాన్ని మల్చుకోలేకపోతున్నానని వాపోయారు.


అయితే, ఆ టెకీ రాసిన వివరాలు చదివిన నెటిజెన్స్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.

మీకు అన్ని ఖర్చులుపోగా ఎంతయితే నెలకు మిగులుతుందో... నాకు అంత మొత్తం జీతం కూడా రావడం లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

బెంగళూరు అంటే అంతే మామా... ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు.

మరొక యూజర్ స్పందిస్తూ... ఈ రోజుల్లో బతుకు బండి లాక్కు రావాలంటే ఒక్కరి జీతంతో సరిపోదు. మీ భార్య కూడా ఉద్యోగం చేయాల్సిందే అని సూచిస్తున్నారు. మరొకరేమో కేవలం ఉద్యోగం మీదే ఆధారపడకుండా మరొక ఆదాయమార్గం కూడా చూసుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెద్ద చర్చకు దారితీయడమే కాదు... పెద్ద మొత్తంలో జీతం వచ్చే వారు కూడా సంతోషంగా లేరనే నిజాన్ని బయటపెట్టింది.

Tags:    

Similar News