2 నెలల క్రితం మృతి చెందిన మహిళ ఖాతాలోకి రూ.1.13 లక్షల కోట్ల జమ! కారణం ఏంటంటే…
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం మృతిచెందిన గాయత్రి దేవి అనే మహిళ ఖాతాలో అకస్మాత్తుగా రూ.1.13 లక్షల కోట్ల (అవును, మీరు చదివింది నిజమే!) డబ్బులు జమయ్యాయని బ్యాంక్ మెసేజ్ వచ్చింది.
2 నెలల క్రితం మృతి చెందిన మహిళ ఖాతాలోకి రూ.1.13 లక్షల కోట్ల జమ! కారణం ఏంటంటే…
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం మృతిచెందిన గాయత్రి దేవి అనే మహిళ ఖాతాలో అకస్మాత్తుగా రూ.1.13 లక్షల కోట్ల (అవును, మీరు చదివింది నిజమే!) డబ్బులు జమయ్యాయని బ్యాంక్ మెసేజ్ వచ్చింది. ఆమె కుమారుడు దీపక్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తన తల్లి ఖాతాకు లింక్ అయిన మొబైల్‌లో మెసేజ్ చూసి షాక్‌కు గురయ్యాడు.
అందులో చూపిన మొత్తం – 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 – చూసి మొదట ఏమీ అర్థం కాలేదు. వెంటనే చుట్టుపక్కల వారికి చూపించగా, వారూ ఆశ్చర్యపోయారు. దీంతో దీపక్ సోమవారం ఉదయం కోటక్ మహీంద్రా బ్యాంక్‌కి వెళ్లి విషయాన్ని తెలిపాడు.
బ్యాంక్ అధికారులు కూడా ఇది చూసి భ్రమించారు. ఇంత భారీ మొత్తం ఒక మృతురాలి ఖాతాలోకి జమ కావడం చూసి, ఖాతాను తక్షణమే ఫ్రీజ్ చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)కి సమాచారం ఇచ్చారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా జమ అయిందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ మొత్తాన్ని ఎవరు పంపారో, ఎందుకు పంపారో, అసలు ఇది అకౌంటింగ్ లో పొరపాటా లేదా ఇతర ఉద్దేశమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
ఇలాంటి సంఘటనలు చట్టపరంగా, సాంకేతికపరంగా ఎంతగానో శోధన చేయాల్సినవి. అసలైన వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది.