Arun Ramachandra Pillai: అరుణ్ రామచంద్ర పిళ్లైకు చుక్కెదురు..బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు..
లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన లాభాలతో.. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై భూములు కొన్నారు.
Arun Ramachandra Pillai: అరుణ్ రామచంద్ర పిళ్లైకు చుక్కెదురు..బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు..
Arun Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లైకి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిళ్లై వేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. తాను కవిత ప్రతినిధిని కాదని, లిక్కర్ పాలసీ రూపకల్పనతో తనకు సంబంధం లేదనే అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిళ్లై. దాంతో పిళ్లై బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి అని తెలిపిన ఈడీ.. కవితకు ప్రతినిధిగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు.లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన లాభాలతో.. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై భూములు కొన్నారని తెలిపారు. ఈడీ వాదనలను పరిగణించిన కోర్టు.. అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.