రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 14మంది వలస కూలీలు మృతి

లాక్ డౌన్ వలన పలు రాష్ట్రంలో చిక్కుకున్న వలస కూలీలు తిరిగి ఇంటికి పయనం అవుతున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2020-05-14 03:36 GMT

లాక్ డౌన్ వలన పలు రాష్ట్రంలో చిక్కుకున్న వలస కూలీలు తిరిగి ఇంటికి పయనం అవుతున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది.. ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్తుండగా గత రాత్రి(బుధవారం)11 గంటల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌- సహరాన్‌పుర్‌ రహదారిపై అదే రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆరుగురు కూలీలపై దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు.

అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. బుధవారం మహారాష్ట్ర నుంచి సుమారు 60 మంది వలసకూలీలు లారీలో తమ స్వస్థలానికి బయలుదేరగా, వీరు ప్రయాణిస్తున్న లారీ మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా మరో 50 మందికిపైగా గాయపడ్డారు. దీంతో వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు

Tags:    

Similar News