Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసుల మృతి
Road Accident: కర్ణాటకలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు.
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసుల మృతి
Road Accident: కర్ణాటకలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కారు, వ్యాన్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం, జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), మరియు నాగరాజు (40) మృతులుగా గుర్తించారు.
వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకుని, కారులో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హల్లిఖేడ్ సమీపంలో అతివేగంగా వచ్చిన వ్యాన్‌ను వీరి కారు బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.