జమ్మూకశ్మీర్ కథువాలో కారు బీభత్సం.. విద్యార్థిని మృతి, 10 మంది విద్యార్థులకు గాయాలు
Road Accident: గాయపడిన విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స
జమ్మూకశ్మీర్ కథువాలో కారు బీభత్సం.. విద్యార్థిని మృతి, 10 మంది విద్యార్థులకు గాయాలు
Road Accident: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒక విద్యార్థిని మృతి చెందింది. మరో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కతువా జిల్లా జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై బర్వాల్ మోర్‌లోని పాఠశాల వెలుపల నిలబడి ఉన్న విద్యార్థులను కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.