నదుల అనుసంధానం ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ

Rivers connectivity: గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక సమావేశం. నేడు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకానున్న 5 రాష్ట్రాల కార్యదర్శులు .

Update: 2022-02-18 03:37 GMT

నదుల అనుసంధానం ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ

Rivers connectivity:  గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలతో కేంద్రం సమావేశం కానుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ కీలక భేటీకి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోనుంది సర్కార్.

ఇప్పటికే సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయ అంచనాతో "డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్" ను రూపొందించింది జాతీయ జల అభివృద్ధి సంస్థ. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. తెలంగాణ సుమారు 80 టీఎంసీలు, ఏపీ సుమారు 90 టీఎంసీలు, పుదుచ్చేరి 5 టీఎంసీలు, తమిళనాడు సుమారు 45 టీఎంసీలు, కర్నాటక సుమారు 25 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక, ఇవ్వాల్టి సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది.. ఆయా రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నాయి.. వాటికి అనుగుణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News