Delhi: సుప్రీం కు 'సాగు చట్టాల'పై నివేదిక

Delhi: సాగు వ్యవసాయ చట్టాలపై నిపుణుల కమిటీ సీల్డ్‌ కవర్‌లో తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

Update: 2021-04-01 02:37 GMT

ఢిల్లీ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Delhi: కేంద్రం ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన మూడు సాగు వ్యవసాయ చట్టాలపై నిపుణుల కమిటీ సీల్డ్‌ కవర్‌లో తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. వివరాల్లోకి వెళితే... గత ఏడాది నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తూ రావడంతోపాటు, వాటి చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటి అమలుపై స్టే విధించడంతో పాటు, ఆ చట్టాల లోతుపాతులను అధ్యయనం చేయడానికి జనవరి 12న కమిటీ ఏర్పాటు చేసింది.

భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు భూపిందర్‌సింగ్‌ మాన్‌, వ్యవసాయ ఆర్థికవేత్తలు ప్రమోద్‌ కుమార్‌ జోషి, అశోక్‌ గులాటీ, షేత్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ గన్వట్‌లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటయింది. రెండు నెలల్లో మూడు వ్యవసాయ చట్టాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించింది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత భూపిందర్‌సింగ్‌ మాన్‌ దాని నుంచి తప్పుకోవడంతో మిగిలిన ముగ్గురు సభ్యులతోనే అది కొనసాగింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తూ పత్రికల్లో బహిరంగ ప్రకటన జారీచేసి ఆన్‌లైన్‌ ద్వారా వాటిని స్వీకరించింది. దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారానే సమావేశాలు నిర్వహించి అందులో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా నివేదిక రూపొందించింది.

Tags:    

Similar News