దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం
డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు.
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం
డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకేసక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్ డీ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్వేశ్ సాహెబ్ సింగ్, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా,పంకజ్ కుమార్ సింగ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేశ్ సాహెబ్ సింగ్ సీఎం రేసులో ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపింది.
బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో రేఖాగుప్తా బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. 27 ఏళ్ల తర్వాత దిల్లీలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. దిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖ గుప్తా బాధ్యతలు చేపట్టారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ తర్వాత రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం తర్వాత దిల్లీలో ముఖ్యమంత్రి ఫీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది.
2015, 2020 ఎన్నికల్లో దిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు దక్కించుకొన్నా అసెంబ్లీలో మాత్రం ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. కానీ, తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపు దిల్లీ ఓటర్లు మొగ్గు చూపారు. ఆప్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. ఆప్ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు ఇతర అంశాలు కూడా చీపురు పార్టీని అధికారానికి దూరం చేశాయి.