దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా: ఫిబ్రవరి 20న ప్రమాణం
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయనున్నారు.బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఫిబ్రవరి 19 రాత్రి జరిగింది.
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయనున్నారు.బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఫిబ్రవరి 19 రాత్రి జరిగింది.ఈ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేఖ గుప్తాను తమ పార్టీ శాసనసభపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేస్తారు. దిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజయేంద్ర గుప్తా ప్రమాణం చేస్తారు.
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీ తర్వాత ముఖ్యమమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నాలుగో మహిళ రేఖా గుప్తా. 27 ఏళ్ల తర్వాత దిల్లీలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది.బీజేపీ శాసనసభపక్ష సమావేశం నుంచి ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరుతారు.
1974 జూలై 19న రేఖా గుప్తా జన్మించారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె గెలిచారు. దిల్లీ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. బీజేపీ దిల్లీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కూడా పనిచేశారు.
దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీకాం పట్టా పొందారు. డిగ్రీ పూర్తైన తర్వాత ఆమె ఎల్ఎల్ బీ చేశారు. 1996-97 లో ఆమె దిల్లీ విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం డీఎస్ డీ యు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. దక్షిణ మున్సిపల్ కార్పోరేషన్ కు ఆమె మేయర్ గా కూడా పని చేశారు. 2007లో ఉత్తరి పితంపుర వార్డు నుంచి దిల్లీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2012 లో కూడా ఇదే వార్డు నుంచి గెలిచారు.